Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు ఉద్యమం సమయంలో ఓవరాక్షన్ చేసి విమర్శల పాలైన సాక్షి టీవీ లాగే.. ఇప్పుడు మరో ఛానెల్ ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని వాడుకునే ప్రయత్నం చేసి బుక్కైంది. ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఎవరూ చనిపోకపోయినా.. మరణించారని వార్తలిచ్చినందుకు సదరు ఛానెల్ పై చర్యలు తప్పవని ఏపీ డీజీపీ హెచ్చరించారు. దీంతో మీడియా వర్గాల్లో కలకలం మొదలైంది.
అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా రిపోర్టింగ్ చేస్తున్న కొన్ని ఛానెళ్లను కట్టడి చేయాలని తెలుగు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. గతంలో కేసీఆర్ కూడా మీడియా అత్యుత్సాహం వద్దని బహిరంగంగానే హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తాను నేరుగా చెప్పకుండా డీజీపీతో చెప్పిస్తున్నారు. ఈ దెబ్బతో ఛానెళ్లన్నీ కాస్త జాగ్రత్తగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కానీ మీడియాను తొక్కేస్తున్నారనే ప్రచారం జరుగుతుందని టీడీపీ వర్గాలు భయపడుతున్నాయి. అయితే తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని, ఎమ్మార్పీఎస్ కార్యకర్త మరణం గురించి ప్రసారం చేసిన ఛానెల్.. ఆధారాలు చూపాలని డీజీపీ ప్రశ్నించారు. దీంతో సదరు ఛానెల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏదో అనుకుంటే మరేదో అయిందని తెగ బాథపడుతున్నారు సదరు ఛానెల్ ప్రతినిధులు.