Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో పూరీ తర్వాత బాగా వినబడుతున్న పేరు ఛార్మి. అమ్మడికి సినిమాలు తగ్గాక డ్రగ్స్ మత్తులో జోగుతోందని, అందుకే పూరీకి దగ్గరైందనే ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా పూరీ గుట్టుమట్లన్నీ ఛార్మికి తెలుసని చెబుతోంది. కానీ ఇప్పుడు ఛార్మి సిట్ అధికారులకే షాక్ ఇచ్చింది. మహిళలకు ప్రత్యేక సదుపాయం ఇవ్వాలని భావించినా.. ఆమే వద్దనడం చర్చనీయాంశమైంది.
మొదట ఛార్మి వాయిదా అడిగితే.. తప్పించుకుంటోందని సిట్ భావించింది. అందుకే మహిళలు సిట్ కార్యాలయానికి రాకుండా.. కోరిన చోట విచారిస్తామని ఆప్షన్ ఇచ్చింది. కానీ ఛార్మి మాత్రం అందరిలాగే విచారించాలని కండిషన్ పెట్టిందట. తానే సిట్ ఆఫీస్ కు వస్తానని, తన కోసం స్పెషల్ అరేంజ్ మెంట్స్ అక్కర్లేదని తేల్చిచెప్పింది. దీంతో ఛార్మి డ్రగ్గిస్టా కాదా అని కొత్త డొట్లు వస్తున్నాయి.
నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఛార్మి ఆప్షన్ ఉపయోగించుకోవాలనేది సిట్ అధికారుల వ్యూహం. అయినా సరే ఆమె వద్దనడం.. ఛార్మి తండ్రి వాదనకు బలం చేకూర్చినట్లైంది. కానీ నిజంగా ఛార్మికి సంబంధం లేదా.. సిట్ దగ్గర ఉన్న ఆధారాలేంటి, ఇక ఛార్మి బయటపెట్టబోయే నిజాలేంటి.. ఇప్పుడీ ప్రశ్నలే ఆసక్తికరంగా మారాయి.
మరిన్ని వార్తలు: