Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న ఒక్కొక్కరు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూరి జగన్నాధ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ విచారణకు హాజరు కాగా, నేడు నవదీప్ సిట్ అధికారుల ముందుకు వెళ్లాడు. త్వరలో హీరోయిన్ ఛార్మి మాత్రం విచారణపై హై కోర్టుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. విచారణ సజావుగా సాగడం లేదని, బలవంతంగా శాంపిల్స్ తీసుకుంటున్నట్లుగా ఆమె ఆరోపిస్తూ హైకోర్టులో పిటీషన్ వేయనుంది అనే వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకోలేదు అన్నప్పుడు శాంపిల్స్ ఇస్తే ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి వరకు విచారణకు హాజరు అయిన ప్రతి ఒక్కరి శాంపిల్స్‌ను కూడా పోలీసులు తీసుకున్నారు, డ్రగ్స్ వారు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సిట్ అధికారులు రక్తం, త వెంట్రుకలు, గోర్లను సేకరించడం జరిగింది. వాటిని ఉస్మానియ హాస్పిటల్‌కు తరలించారు. ఇక ముందు హాజరు కాబోతున్న వారి నుండి కూడా శాంపిల్స్‌ను తీసుకోనున్నారు. అందుకు ఛార్మి విచారణకు హాజరు అయ్యేందుకు ఆందోళన చెందుతుంది. శాంపిల్స్ తీసుకోకుండా విచారణకు అయితే సిద్దం అని ఈ అమ్మడు చెబుతుంది. హై కోర్టు నుండి ఈమె శాంపిల్స్‌ను తీసుకోకుండా ఆర్డర్ తీసుకు వస్తుందా అనేది చూడాలి. శాంపిల్స్ ఇస్తే డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిపోతుందని ఛార్మి ఇచ్చేందుకు ఓకే చెప్పడం లేదని తేలిపోయింది. ఇలాంటి కేసుల్లో కోర్టు ఎలా వ్యవహరిస్తుంది అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. పూరికి డ్రగ్స్ అలవాటు చేసింది ఛార్మి అనే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విచారణ ఎలా సాగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వార్తలు: