Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదమూడేళ్లకే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి.. తొలినాళ్లలో మంచి సినిమాలే చేసింది. ఆ తర్వాత కూడా సినిమాలు ఫ్లాపైనా ఛార్మికి టాలెంట్ లేదని మాత్రం ఎవ్వరూ అనే ధైర్యం చేయలేదు. ఇప్పటికీ యూత్ లో ఛార్మికి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఛార్మి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం చాలా మందికి మింగుడు పడటం లేదు.
అందరిలాగా విచారణకు వస్తే తన స్పెషాల్టీ ఏముంది అనుకున్న ఛార్మి.. విచారణ తీరు సరిగా లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. టాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే అకున్ సభర్వాల్ టీమ్ సినిమావాళ్లను టార్గెట్ చేస్తోందని, ఇప్పుడు ఛార్మి దూకుడుతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లైందని ఇండస్ట్రీ పెద్దలు వాపోతున్నారు. ఎవరు వద్దని చెప్పినా ఛార్మి వినకుండా కోర్టుకెక్కడం అందర్నీ టెన్షన్ పెడుతోంది.
కోర్టు విచారణను ఆపే అవకాశాల్లేవని న్యాయనిపుణులంటున్నారు. ఇక శాంపిల్స్ కు ఛార్మి ముందే నో చెబితే.. ఆమె తప్పు చేసినట్లేనని ఇండస్ట్రీయే కాదు జనం కూడా నమ్మేస్తారు. అదీ సిట్ కు నైతిక విజయమే. ఇలా ఛార్మి ఎరక్కపోయి ఇరుక్కుపోయిందని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థం లేని ఆవేశంతో, ఆలోచన లేకుండా వ్యవహరించిందని వారు వాపోతున్నారు.
మరిన్ని వార్తలు: