అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల స్పీడ్ చెస్ ఆన్‌లైన్ రెండో గ్రాండ్‌ప్రి చాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి సంచలనం సృష్టించింది.
బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల వైశాలి 6–4 పాయింట్ల తేడాతో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2016 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్ అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. హారిక 4–7 పాయింట్ల తేడాతో అనా ఉషెనినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది.