తాగిన మైకంలో తనను కాటేసిన పామును కరకరా నమిలి !

chews-the-snake-in-a-drunken-state

పాము కాస్తే ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తుతారు కదూ. హాస్పిటల్ దూరంగా ఉంటే ప్రథమ చికిత్స చేయించుకొని సాధ్యమైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తాగిన మైకంలో పామును ముక్కలుగా కొరిమి నమిలేశాడు.

దీంతో ఆ పాము చనిపోయింది. ఈ ఘటన ఉతాహ్ జిల్లాలోని అస్రౌలి జిల్లాలో చోటు చేసుకుంది.  బాబూ రామ్ అనే వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. అతడి కుమారుడైన రాజ్‌కుమార్‌ను కాటేసింది. కానీ అప్పటికే ఫుల్లుగా మందేసిన రాజ్ కుమార్.. మద్యం మత్తులో, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో పామును పట్టుకొని పరపరామంటూ కొరికి ముక్కలు చేశాడు.

కొన్ని ముక్కలను నోటితో నమిలేశాడు. దీంతో ఆ పాము ప్రాణాలు విడిచింది.  ప్రస్తుతం రాజ్‌ కుమార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, వేరే హాస్పిటల్‌కు రిఫర్ చేశామని డాక్టర్లు తెలిపారు. తన కుమారుడి చికిత్సకయ్యే ఖర్చును భరించగలిగే స్థితిలో లేనని, తనను ఆదుకోవాలని బాబూ రామ్ కోరుతున్నాడు