గోరఖ్ పూర్ మరణ మృదంగం

child-death-in-gorakhpur

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నెల రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో చిన్నారుల మరణాలు యూపీ గోరఖ్ పూర్ ఆస్పత్రిని ఫేమస్ చేస్తున్నాయి. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా.. ఆశ్పత్రిలో సిబ్బంది తీరు కూడా మారలేదు. పైగా రోగులకు తామేదో ఉద్ధరిస్తున్నట్లుగా ఫోజోలు కొడుతున్నారు. మరోవైపు శిశు మరణాలు జరుగుతూనే ఉంటాయి.

ఇప్పటికి మూడు సార్లు వంద నుంచి రెండు వందల మంది వరకు పిల్లలు మరణించారు. అయినా సరే సీఎం యోగి ఆదిత్యనాథ్ సాధారణ విజిట్ తో సరిపెడుతున్నారే కానీ.. ఇంతవరకూ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. మొదటి ఘటనను వదిలేసినా.. తర్వాత కూడా అదే రిపీట్ కావడం ముఖ్యమంత్రిపై జనంలో నమ్మకం తగ్గించింది.

తానేదో అద్భుతాలు చేస్తానని జనాన్ని నమ్మించిన యోగి.. కనీసం వరద నీటి నుంచి తమ పంటల్ని రక్షించలేకపోతున్నారన రైతులు బాథఫడుతున్నారు. మొన్ననే ఆరెస్సెస్ యోగికి తలంటింది. అయినా సరే గోరఖ్ పూర్ లో మూడోసారి శిశుమరణాలు జరగడం చూస్తుంటే.. యోగి ఎక్కువకాలం పదవిలో ఉండకపోవచ్చనే విధంగా పరిస్థితులున్నాయి.

మరిన్ని వార్తలు:

శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గా ఫ‌రూఖ్

బ్రిక్స్ స‌ద‌స్సులో పాకిస్థాన్‌, చైనాల‌కు ఎదురుదెబ్బ‌

వంగ‌వీటి గొడ‌వ‌పై వ‌ర్మ వివాదాస్ప‌ద కామెంట్లు