లాక్ డౌన్ వేళ చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అందరికీ కష్టాలే.. ప్రజలంతా ఎక్కడివారు అక్కడ ఉండిపోవాలనే నియమంతో ఏం జరిగినా కదలలేని పరిస్థితి నెలకొంది. మరేం లేదు కానీ… ఆ కరోనా వైరస్ అనే మహమ్మారి తీవ్రత అలాంటిది మరి.. దాన్నేం చేయలేం.
అయితే మొన్న ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వారి సతీమణికి పరీక్షలు చేయించగా ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే ఆమె నిండు గర్భిణి. మొత్తానికి ఢిల్లీస్థాయిలో వైద్యబృందమంతా ఆమె డెలివరీని చేసి సక్సెస్ సాధించారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో కేసు వచ్చింది. ఇది క్వారంటైన్ లో ఉన్న ఒకరు నిండుగర్భిణి. డెలివరీ టైం. దాంతో వైద్యులు చాలా జాగ్రత్తగా డీల్ చేసి డెలివరీ చేశారు. క్వారంటైన్ కేంద్రంలో ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా లాక్ డౌన్ తో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ 13రోజులుగా శ్రీకాకుళం పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఉంటుంది. అయితే ఆమెను వైద్యులు డెలివరీ నిమిత్తం.. శ్రీకాకుళంలోని సృజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జె.
నివాస్ ఆస్పతికి చేరుకున్నారు. క్వారంటైన్ లో వసతుల గురించి మహిళను అడిగి తెలుసుకున్నారు. ఆమె వసతులు బాగానే ఉన్నాయని సమాధానం చెప్పారు. దాంతో కలక్టర్ ఆ మహిళకు బేబీ కిట్ ను అందజేసారు. అంతే కాకుండా బిడ్డ సంరక్షణ కోసం రూ. 25వేలు కూడా తల్లికి అందజేశారు.