చైనా తోక వంకరే

China Encourages war

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కొంతమంది బుద్ధి మారదు. చైనా కూడా అంతే. ఎన్నోసార్లు ఎక్స్ ట్రాలు చేసినా సంయమనం ప్రదర్శిస్తున్న భారత్ అంటే డ్రాగన్ కు లోకువైపోయింది. అందుకే షూ పెట్టెలపై జాతీయ జెండా ముద్రించి మరీ మన దేశానికి పంపింది. వ్యాపారి ఇవి చూసి షాక్ తిని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మొన్న డోక్లాం. నిన్న లడఖ్ అన్నీ మావేనంటూ తెగబడుతున్న చైనా.. అరుణాచల్ కూడా తమదేనని వాదిస్తోంది. అంతటితో ఆగకుండా భారత్ ను యుద్ధానికి కవ్విస్తోంది. దమ్ముంటే యుద్ధం చేయాలని రెచ్చగొడుతోంది. అంత దమ్ముంటే మీరే దాడి చేయొచ్చుగా అని ఎవరైనా అడిగితే మాత్రం మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తూ.. శాంతిని కోరుకుంటున్నామని చిలక పలుకులు చెబుతోంది.

చైనాకు గుణపాఠం చెప్పడానికే మోడీ సర్కారు సరిహద్దుల్లో రోడ్లేస్తోంది. ఎన్నికల నాటికి యుద్ధానికి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. కనీసం పాక్ తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని అనుకుంటున్నారు. కానీ చైనాతో పాక్ తో ఆడినట్లు చెలగాటం ఆడితే కుదరదు. చైనాపై కవ్వింపుకు దిగిన తక్షణం యుద్ధం మొదలైనట్లే. అందుకే అన్ని విధాలా రెడీ అయ్యాకే ఏ చర్య అయినా తీసుకోనుంది కేంద్రం.