Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అది 1965వ సంవత్సరం. పాకిస్థాన్ తో ఇండియా వార్ జరుగుతోంది. అంతకు మూడేళ్ల ముందే ఇండియాపై యుద్ధంలో గెలిచి ఉత్సాహంగా ఉన్న డ్రాగన్.. పాకిస్థాన్ కు ప్యాటన్ ట్యాంకులు సరఫరా చేసింది. మన ఆర్మీ దగ్గర అప్పటికి సరైన ట్యాంకుల్లేవు. కేవలం 303 రైఫిళ్లతోనే మనవాళ్లు యుద్ధం చేస్తున్నారు. దీంతో విజయం తమదేనని పాక్ విర్రవీగింది. కానీ రణరంగంలో వేరేలా జరిగింది.
ప్యాటన్ ట్యాంకుల్ని స్టడీ చేసిన ఇండియన్ ఆర్మీ.. దీటైన వ్యూహం రచించింది. 303 రైఫిల్స్ తో మూడు బుల్లెట్లు ట్యాంకు చైన్లోకి దించి.. మొత్తం 175 ట్యాంకులు కదలకుండా చేసింది. ఆ చెడిపోయిన ట్యాంకుల్ని పాక్ యుద్ధంరంగంలో వదిలేసిపోతే.. వాటిని ఓ ప్రదేశానికి తరలించి.. ప్యాటన్ నగరాన్ని ఏర్పాటుచేసింది. ఇండియన్ ఆర్మీ సాహసం చూసి ప్రపంచమే అబ్బురపడింది. చైనాకైతే ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పట్నుంచి చైనా భారత్ ఆర్మీతో జాగ్రత్తగా ఉంటోంది.
కానీ కొద్దిరోజుల నుంచి డోక్లాంలో ఎక్స్ ట్రాలు చేస్తున్న చైనా.. భారత్ ను యుద్ధానికి కవ్విస్తున్నా.. సాహసం చేయకపోవడానికి అదే కారణమనే వాదన కూడా ఉంది. ప్యాటన్ నగరాన్ని తలుచుకుంటే చైనాకు వెన్నులో వణుకు పుడుతుందట. భారత్ ఆర్మీకి ఉన్న తెగువ ప్రపంచంలో ఏ ఆర్మీకి లేదు. పైగా నేలపై యుద్ధం చేయడంలో, శత్రువుతో ముఖాముఖి తలపడం చైనాకు చేతకాని విద్యలు. అందుకే డ్రాగన్ కు యుద్ధం చేయాలని ఉన్నా.. మనసు మాత్రం వెనక్కు లాగుతోంది.
మరిన్ని వార్తలు: