చైనాలోని వూహాన్ లో పుట్టి ప్రపంచాన్ని అంతా అల్లకల్లోలం చేస్తుంది కరోనా వైరస్. ఈ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే అసలు ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో జరిగే అన్ రకాల క్రీడలు నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు చైనాలో క్రీడలు ప్రారంభమౌతున్నాయి.
చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్) కొత్త సీజన్‌ను జూన్ చివరన కానీ.. లేదా జూలై ఆరంభంలోకానీ ప్రారంభించబోతున్నట్లు ఆ క్లబ్ సిఇఒ ‘హువాంగ్ షెంఘువా’ తెలిపారు. సిఎస్ఎల్ మొదట ఫిబ్రవరి 22న ప్రారంభం కావాల్సి ఉంది.. కాని అక్కడే పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా ఈ లీగ్ వాయిదా పడింది. అయితే గత ఏడాది చివర్లో కొత్తగా సోకిన కరోనా దెబ్బకు చైనాలో 82,747 కేసులు నమోదుకాగా.. 4,632 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకొన్న చైనా..
కొత్త సీజన్ జూన్ చివరిలో లేదా జూలై ప్రారంభంలో ప్రారంభించబోతున్నట్లు క్లబ్ సీఈవో స్పష్టం చేశారు. కాగా చైనాలోని ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇంకా ప్రారంభ తేదీని ప్రకటించలేదు. అయితే అక్కడ స్థానికంగా ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ.. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందనుందని భావించిన విదేశీయులకు ప్రయాణ ఆంక్షల విధింపు ఇంకా అమలులోనే ఉంది. మొత్తానికి చైనాలో జరుగుతున్న తంతును ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తుండటం విశేషం.