Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మేడిన్ జర్మనీ అంటే వాల్డ్ వైడ్ గా క్రేజ్. ఎందుకంటే ఇంతవరకూ ప్రతి దేశం తయారుచేసిన వస్తువుల్లోనూ లొసుగులున్నాయి. కానీ జర్మన్ మేడ్ వస్తువులు ఇంతవరకూ రిమార్క్ లేదు. ఏ దేశం వెళ్లినా జర్మనీ క్రేజ్ పెంచాయే.. తప్ప తగ్గించలేదు. అలాంటి సమయంలో మేడిన్ జర్మనీ పేరిట చైనా భారత్ ఆర్మీకి వల విసురుతోందన్న నిఘా వర్గాల సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
చైనా సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. డ్రాగన్ కు దీటుగా భారత్ కూడా దౌత్య మార్గాల్లో ఒత్తిడి పెంచుతూనే.. యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో భారీగా ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ఇదే అదనుగా చైనా మేడిన్ జర్మనీ పేరిట నకిలీ ఆయుధాలు విక్రయిస్తూ.. ఇండియన్ ఆర్మీ నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలని స్కెచ్ వేసిందట.
నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఆర్మీ ఉన్నతాధికారులు అలెర్టయ్యారు. ఆయుధాల్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చెక్ చేయాలని, అదీ పూర్తిస్థాయిలో పరీక్షించాలని డిసైడయ్యారు. భారత్ ను నేరుగా ఢీకొట్టడం చేతకాకే ఇలాంటి ట్రిక్స్ చేస్తోందని చైనాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతి భారీ ఆర్మీ ఉన్న చైనాకు భారత్ ను చూస్తే అంత వణుకు ఎందుకో.
మరిన్ని వార్తలు: