Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
China’s Three-Dimensional War Strategy
డోక్లాం సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా మీడియా రోజుకో రకంగా వార్తలు రాస్తూ…ఉద్రికత్తలను పెంచిపోషిస్తాంది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలితాన్నివ్వటం లేదు. మూడు రోజుల వ్యవధిలో ఇరు దేశాల మధ్య రెండు సార్లు జరిగిన చర్చలు చైనా మొండి వైఖరి కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అటు రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో చైనా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. భారత్ పై యుద్ధానికి దిగుతామంటూ హెచ్చరికలు చేస్తున్న డ్రాగన్…ఉత్తర కొరియా, అమెరికా మాత్రం యుద్ధం లేకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆ దేశాలకు సూచిస్తోంది. మరోవైపు భారత్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా హెచ్చరికలతోనే సరిపెడుతున్న చైనా…ఓ సరికొత్త వ్యూహంతో ముందుకు పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా చైనా త్రిముఖ యుద్ద వ్యూహం అనుసరిస్తోందని, చైనా ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుందని…రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజలు, మీడియా.మానసిక, న్యాయపోరాటాలతో శత్రువును దెబ్బతీయటమే త్రిముఖ యుద్ధ వ్యూహం. దీన్ని ప్రయోగించటంలో చైనాది సిద్ధ హస్తం. 2003లో దీన్ని తెరమీదకు తెచ్చిన చైనా సైన్యం 2010నాటికి దీనికి మరింత పదును పెట్టింది. దక్షిణ చైనా సముద్రం సహా
పలు వివాదాస్పద అంశాల్లో చైనా ఈ అస్త్రాన్నే ప్రయోగించింది. త్రిముఖ యుద్ద వ్యూహంతోనే ఫిలిప్పీన్స్ నున దారిలోకి తెచ్చుకుంది. డోక్లామ్ లోనూ దీన్నే ప్రయోగిస్తోంది. చైనా మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. భారత్ కు వ్యతిరేకంగా ఆ దేశ మీడియా రోజూ హెచ్చరికలు జారీ చేస్తోంది. యుద్దం తప్పదని వార్తలు రాస్తోంది. భారత్ మీడియాతో పాటు ప్రపంచ మీడియాను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 2012 నాటి మూడు దేశాల ఒప్పందాన్ని మీడియాలో తమకు అనుకూలంగా నిర్వచించుకుంటోంది. తమ వార్తలు భారత్ మీడియాలో వచ్చేలా చూసుకోవటం తో పాటు భారత ప్రభుత్వ వాదన తప్పన్న సందేహాలు భారత ప్రజల్లో కలిగించేందుక ప్రయత్నిస్తోంది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను అబద్దాల కోరుగా అభివర్ణించటం, సిక్కిం విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని బెదిరెంచటం వంటివన్నీ …మానసికంగా పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలే…త్రిముఖ యుద్ద వ్యూహంలో భాగంగా అబద్దాలు ఆడేందుకు కూడా చైనా వెనుకాడదు. డోక్లాం తమ భూభాగం కాదని భూటాన్ అన్నట్టు చైనా అధికారులు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను భూటాన్ ఖండించింది. అటు రేపు జరిగే పాకిస్థాన్ స్వతంత్ర వేడుకలకు చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ హాజరవుతున్నారు. భారత్ పై ఒత్తిడి పెంచేందుకే చైనా ఈ వేడుకలకు హాజరవుతోందని భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు: