సరిగ్గా ఏడాది క్రితం జనసేన ప్రకటించిన పార్టీ సలహాదారు,వ్యూహాకర్త వాసుదేవ్ తెలుగురాదంటునే.. మరోపక్క తెలుగు అనర్గళంగా మాట్లాడి పవన్ ను పొగడ్తలతో ముంచిన ఈయన. ఆ తర్వాత కనపడలేదు. పవన్ రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నరన్న విమర్శలకు చెక్ పెడుతూ ఇక ప్రజల మధ్య ఉండేలా ఆయనను అప్పట్లో రంగంలోకి దింపారు. వాసుదేవ్ ను పరిచయం చేస్తూ , జాతీయ స్ధాయిలో వివిధ పార్టీలకు ఆయన పదేళ్లుగా సేవలు అందించారని చెప్పారు పవన్. దేవ్, జనసేన వాలంటరీ టీం 1200మంది మరియు ఆయన దగ్గర పనిచేసే మరో 300 మందితో గ్రామీణ స్ధాయిల్లోకి పార్టీని తీసుకెళ్ళేందుకు కృషి చేయబోతున్నారని పేర్కొన్నారు. అప్పుడే ఈ దేవ్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలను కనిపెట్టిన టీడీపీ శ్రేణులు పదేళ్ళు పాటు వాసుదేవ్ పనిచేసిన పార్టీ బి.జె.పి అని గతంలో తెలంగాణలో బి.జె.పి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో పాటు మంచి సంబంధాలు నెరిపి, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ గా చలమాణి అయ్యారని తేల్చారు. ఆయన వచ్చి ఈరోజుకి ఏడాది మరి ఆయన ఎక్కడున్నారో ? అసలు మొన్న ఎన్నికలకి అయన ఒకరు ఉన్న సంగతి కూడా గుర్తు లేదు పాపమ్.