Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిన్న చిత్రంగా విడుదలైన ‘ఫిదా’ పెద్ద చిత్రాల రికార్డులను బ్రేక్ చేసి దూసుకు పోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో కనీవిని ఎరుగని స్థాయిలో వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్లో ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఫిదా’ చిత్రం తాజాగా పవన్ కళ్యాణ్ ఆల్‌టైం రికార్డు అయిన ‘అత్తారింటికి దారేది’ రికార్డును సైతం బ్రేక్ చేసింది. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల చిత్రాల కంటే ‘ఫిదా’ చిత్రం కలెక్షన్స్ భారీగా ఉన్నాయి. 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌కు దగ్గరగా ఉన్న ‘ఫిదా’ చిత్రం మరో వారం రోజుల్లో ఇంకో అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం అయిన ‘ఖైదీ నెం.150’ చిత్రం 2.4 మిలియన్ డాలర్లను ఓవర్సీస్లో వసూళ్లు చేసింది. మరో వారాంతంలో ఖచ్చితంగా ఆ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. దిల్‌రాజుకు లాభాల వర్షం కురిపించింది. ఓవర్సీస్ మరియు నైజాం ఏరియాల్లో ఈ సినిమా అనూహ్యంగా అద్బుతమైన కలెక్షన్స్‌ను రాబట్టింది. ఏపీలో కూడా మంచి వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఈ సంవత్సరం విడుదలై సక్సెస్ దక్కించుకున్న చిత్రాల్లో టాప్ 5లో స్థానం దక్కించుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఓవర్సీస్లో ఖైదీ రికార్డు బద్దలు అయితే గ్రేట్ అంటూ ప్రచారం జరుగుతుంది.
మరిన్ని వార్తలు: