Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Chiranjeevi To Audio Release Allu Arjun To Pree Release Audio Function
ఏపీ మంత్రి గంట శ్రీనివాసరావు తనయుడు రవితేజ హీరోగా పరిచయం అవుతున్న ‘జయదేవ్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరియు మోహన్‌బాబులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దాంతో సినిమాకు మాంచి ప్రమోషన్ దక్కింది. సినిమా విడుదల దగ్గపడుతున్న సమయంలో మరోసారి భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు సంబంధించిన అతిథులను పిలిచే పనిలో మంత్రి ఉన్నాడు.
ఆడియో విడుదల కార్యక్రమంకు చిరంజీవి చీప్ గెస్ట్‌గా రాగా ఈసారి ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ను చీప్ గెస్ట్‌గా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుసగా సక్సెస్‌లతో దూసుకు పోతున్న అల్లు అర్జున్‌తో ఈ సినిమాకు మంచి మైలేజ్ రావడం ఖాయంగా భావించి మంత్రి గంట మరియు దర్శకుడు జయంత్ భావిస్తున్నారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా లేదా అనేది చూడాలి. అంతా భారీగా చేస్తున్నా కూడా రవితేజకు హీరోకు ఉండాల్సిన లక్షణాలు లేక పోవడం విచారకరం. హీరోగా రవితేజ సెటిల్ అవ్వడం అంటే కాస్త కష్టమే అని అంతా అంటున్న మాట. కాని మంత్రి కొడుకు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో రవితేజకు మంచి భవిష్యత్తు ఉందని తప్పకుండా హీరోగా సక్సెస్ అవుతాడని అంతా పైకి చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: