తండ్రి కోసం రవితేజ నెలకు లక్ష ఖర్చు!

The Filmmaker Club says Raviteja's father spends lakh rupees a month

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

The Filmmaker Club Says Raviteja’s Father Spends Lakh Rupees A Month

రవితేజ తెలుగులో ఫేమస్‌ హీరో. ఈయన కింది స్థాయి నుండి స్టార్‌గా ఎదిగిన వ్యక్తి. కొత్తగా ఇంస్ట్రీకి రావాలనుకునే వారికి రవితేజ ఆదర్శంగా చెప్పుకుంటారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎదిగిన రవితేజ కుటుంబం గురించి చాలా రహస్యాలు దాగి ఉంటాయి. తాజాగా రవితేజ తమ్ముడు భరత్‌ రాజు కారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తమ్ముళ్లతో రవితేజకు ఉన్న సంబంధం ఎలాంటిదో భరత్‌ అంత్యక్రియలు జరిగిన తీరును బట్టి అర్థం అవుతుంది. ఇక రవితేజ తండ్రి విషయంలో టాలీవుడ్‌లో పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రవితేజ కుటుంబంకు సన్నిహితంగా ఉండే వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ తండ్రి తాగుబోతు, బాగా పేకాట ఆడతాడు. ఫిల్మ్‌ నగర్‌ క్లబ్‌లో ప్రతి రోజు రవితేజ తండ్రి ఉదయం నుండి రాత్రి వరకు పేకాట ఆడటంతో పాటు బాగా మద్యం తాగుతాడు అని సమాచారం. అయితే రెండు సంవత్సరాలుగా రవితేజ తండ్రిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశాడు. రెండు సంవత్సరాల ముందు వరకు వారంకు 25 వేల చొప్పున తండ్రికి ఇచ్చేవాడని, నెలకు రవితేజ తండ్రి లక్ష రూపాయలను ఖర్చు చేసేవాడని ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌ వారు చెబుతూ ఉంటారు. తండ్రిని మొదట డబ్బులిచ్చి మరీ రవితేజ చెడగొట్టాడు అనే విమర్శలున్నాయి. ప్రస్తుతం రవితేజ తండ్రి తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తాగితాగి లివర్‌ డ్యామేజ్‌ అయినట్లుగా సమాచారం. రవితేజ పైకి స్టార్‌గా కనిపిస్తు అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నా లోలోపల మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.

మరిన్ని వార్తలు: