Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత వచ్చిన చిరంజీవిని ప్రేక్షకులు ఆధరించడంతో ఆయన తర్వాత సినిమా మరింత ఆసక్తిగా ఉండాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు. దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ‘ధృవ’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే మూడు భాషలకు తగ్గట్లుగా టైటిల్‌ను నిర్ణయించారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మహావీర’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. ‘బాహుబలి’ సినిమా టైటిల్ మూడు భాషల్లో ఒక్కటే అవ్వడం వల్ల ప్రమోషన్లో హెల్ప్ అయ్యింది. అలాగే ‘మహావీర’ టైటిల్‌ను మూడు భాషల్లో కూడా ఉంచితే తప్పకుండా హెల్ప్ అవుతుందని చరణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉయ్యాలవాడ అనే టైటిల్ అనుకున్నప్పటికి మహావీరను ఫైనల్ చేయడం జరిగింది. ఉయ్యాలవాడ కూడా రామ్‌చరణ్ బ్యానర్లో రిజిస్ట్రర్ అయ్యి ఉంది. ఇటీవలే కొణిదెల ప్రొడక్షన్స్‌పై ‘మహావీర’ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. వచ్చే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
మరిన్ని వార్తలు