టైటిల్ : చిత్రలహరి
తారాగణం : సాయి ధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత : రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి
తారాగణం : సాయి ధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత : రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి
మెగా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి తన సత్తా చాటిన హీరో ‘సాయి తేజ్’. ఆపై వరుసగా ఆరు ప్లాపులతో ఢీలా పడ్డ తేజ్ తాజాగా నటించిన సినిమా ‘చిత్రలహరి’. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించడంతో సినిమా మీద అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అదీ కాక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మీద అందరికీ పాజిటివ్ ఒపినీయనే ఉంది. మరి అలాంటి ఈ సినిమా ఏమేరకు అంచనాలు అందుకుందో చూద్దాం.
కధ :
విజయ్ కృష్ణ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరుగుతాడు. మనోడికి దరిద్రం ఎప్పుడూ పక్కనే ఉంటుంది, ఏమి చేసినా కలసి రాకుండా ఉంటుంది. ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏదైనా ప్రాజెక్ట్ చేసి సెటిల్ అవుదామని తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో లహరి(కళ్యాణి ప్రియదర్శన్) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెని నొప్పించాకూడదని చెప్పిన ఒక అబద్దం వారు విడిపోడానికి కారణం అవుతుంది. అదే జీవితం అనుకున్న ప్రొజెక్ట్ కూడా రిజెక్ట్ అవుతుంది. ఇలా ఫెయిల్యూర్స్ తో విసిగిపోయి ఒక సగటు మధ్యతరగతి కుర్రాడు ఏమి చేశాడు ? అనేదే ఈ సినిమా కధ.
విశ్లేషణ :
దర్శకుడు కిషోర్ తిరుమల చిత్రలహరిని కమర్షియల్ సినిమాగా తెరకెక్కించే క్రమంలో ఇబ్బంది పడ్డాడు. నిజానికి ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది, దీనికి కావాలని కమర్షియల్ హంగులు అద్దిన్నట్టు అనిపించింది. నిజానికి ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేసి రాసుకుంటే సరిపోయేది కానీ దర్శకుడు అటు ఫ్యామిలీస్ ని ఇటు యూత్ ని అందరినీ సంతృప్తిపరచాలని చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. సాయి తేజ్ క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ కాస్త కొత్తగా ఉన్నా కథనం చాలా నెమ్మదించింది. దర్శకుడిగా ఆకట్టుకోని కిషోర్ తిరుమల రచయితగా మాత్రం అలరించాడు. అన్నీ డైలాగ్స్ పేలాయి.
నటీనటురు :
సాయి తేజ్ నటన బాగుంది కానీ లుక్ మారుద్దామనే ప్రయత్నంలో పెంచిన గెడ్డం మాత్రం ధరమ్ తేజ్ ని వరుణ్ తేజ్ లా చూపింది కొన్ని లాంగ్ షాట్స్‌లో . కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ను సరిగా క్యారీ చేయలేకపోయాడు. కళ్యాణి పాత్రకి అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. కానీ ఆమెకు తేజ్ తో కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. నివేదా పేతురాజ్ పోషించిన స్వేచ్ఛ పాత్ర రియాలిటీకి దగ్గరగా ఉంది. మన జీవితంలోనూ ఇలాంటి ఒక తండ్రి ఉంటే బాగుండు అనిపించేంతలా పోసాని పాత్ర ఉంది. సునీల్. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది. ఇక మిగిలిన రావు రమేష్, ప్రభాస్ శీను లాంటి వారు ఒకటి రెండు సీన్లకే పరిమితం అయ్యారు.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : పేరు మారినా లక్కు మారలేదు తేజా
తెలుగు బులెట్ రేటింగ్ : 2/5