ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సెమీ క్రిస్మస్ అంటూ నెల రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశృతి చోటు చేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వివరాల్లోకెళ్తే, పశ్చిమ ఫ్రాన్స్ లోని మోటో డీ10 లో ఎయిర్ బస్ అట్లాంటింగ్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేశారు.
కంపెనీ సమీపంలోని ఓ రెస్టారెంట్ గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీప్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. విందు తర్వాత దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థత గురయ్యారు కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకోగా మరికొందరు అస్వస్థత గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్బస్ అట్లాంటిక్ తమ ఉద్యోగులకు మెరుగైన వైద్య ఏర్పాట్లు చేసింది. వారందరూ వాంతులు విరోచనాలతో బాధపడ్డట్టు ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ ధ్రువీకరించింది.