Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత మూడు నాలుగు నెలల కాలంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు సరైన సినిమా రాలేదు. దాంతో సంక్రాంతి సీజన్‌కు ముందు నుండే థియేటర్లు వెలవెల పోతూ ఉన్నాయి. ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో పదుల సంఖ్యల్లో సినిమాలు విడుదల అయ్యాయి. కాని ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా ఏ ఒక్క థియేటర్లో అయినా హౌస్ ఫుల్ అయిన దాఖలాలు లేవు. తాజాగా విడుదలైన ‘ఎమ్మెల్యే’ చిత్రం కూడా తీవ్రంగా నిరాశ పర్చింది. దాంతో థియేటర్లు ఎప్పుడెప్పుడు హౌస్ ఫుల్ అవుతాయా అంటూ ఎదురు చూస్తున్నాయి. థియేటర్ల యాజమాన్యాలు మరియు థియేటర్లలో పని చేసే చిన్న చిన్న వర్కర్క్ కూడా చేతినిండా పని లేక ఢీలా పడిపడిపోతున్నారు.
ఎట్టకేలకు థియేటర్లకు కల రాబోతుంది. ఈనెల 30న రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయం అని ఇప్పటికే ట్రైలర్ మరియు టీజర్లను చూస్తుంటే అర్థం అవుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం థియేటర్లకు పట్టిన దుమ్ము పోయేలా పబ్లిక్‌ను రాబట్టగలదనే నమ్మకం వ్యక్తం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం థియేటర్లు అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి. చిన్నా చితకా సినిమాలు ఆడుతున్న థియేటర్లన్నింటిలో కూడా రంగస్థలం పడబోతుంది. దాదాపు 90 శాతం థియేటర్లలో రంగస్థలం ఆట పడటం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.