నల్లమల అడవులని కాపాడమని గలమెత్తిన సినీ ప్రముఖులు

నల్లమల అడవులని కాపాడమని గలమెత్తిన సినీ ప్రముఖులు

గత కొద్దీ రోజుల నుండి నల్లమల్ల అడవుల గురించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. నల్లమల్ల అడవి ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో దానికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు తమ తమ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున క్యాంపైన్ రన్ చేస్తున్నారు. రాష్టంలోని కొందరు కవులు ప్రముఖ సినీ ప్రముఖులను కలిసి వాళ్ళ సంతకాలు సేకరించి వాటిని గవర్నర్ కి అందచేసే పనిలో ఉన్నారు.

దర్శకులు సురేందర్ రెడ్డి, శేఖర్ కమ్ముల,నాగ్ అశ్విన్ సినీ ప్రముఖులు, ఆర్పీ పట్నాయక్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, గాయత్రి గుప్త, చంద్ర సిద్దార్ద్ , క్రీడాకారిణి గుత్తా జ్వాల లాంటి వాళ్ళు నల్లమల్ల కాపాడటం కోసం, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తమ తమ సంఘీభావం తెలుపుతున్నారు. నల్లమల్ల లో యురేనియం తవ్వకాలు జరిపితే అక్కడ వుండే జంతువులు, అనేక వందల జీవులు అక్కడి నుండి తరలిపోవాల్సి వస్తుంది,

అదే విధంగా కృష్ణానది మొత్తం కలుషితం అవుతుంది. అలాగే అక్కడే బ్రతికే కొన్ని వేలమంది చెంచుల జీవితాలు నాశనం అవుతాయి, వాళ్ళ జీవనాదారం దెబ్బ తింటుంది, అక్కడ యురేనియం తవ్వితే ప్రకృతి సమతుల్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. నల్లమల్ల అడవులు అనేవి మనకి ఊపిరితిత్తులు లాంటివి వాటిని నాశనం చేస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో జీవన మనగడ ప్రశ్నర్ధకం అవుతుంది. అందుకే అక్కడ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తుంది.