విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతి పోలీసుకు ఇన్యూరెన్స్ కింద రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల బీమా కవరేజీ ఇచ్చేందుకు ఎస్బీఐ ముందకొచ్చిందని వెల్లడించారు సీఎం జగన్. ఈ మేరకు ఆ బ్యాంకుతో నెగోషియేషన్ పూర్తియిందని ప్రకటన చేశారు.
విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని.. పోలీస్ ఉద్యోగం ఒక సవాల్ అన్నారు సీఎం జగన్. ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందని.. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందని.. ఇంటర్ నెట్, ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న వారిని ఎదుర్కోవలసిన బృహత్తర బాధ్యత పోలీసులపై ఉందని సీఎం జగన్ వివరించారు.