సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాలు

సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాలు

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రభివృద్ధికై ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా కృషి చేస్తున్నారు. కాగా ఈమేరకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలందరి ప్రశంసలను పొందుతున్నారు సీఎం జగన్. కాగా ఈ నేపథ్యంలో పేదరికంతో చదువుకునే పిల్లలు బడికి, చదువులకు దూరం కాకూడదనే అంశంతో ఇచ్చినటువంటి జగనన్న అమ్మఒడి పథకమును ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్దమైంది.

కాగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకానికి సంబందించిన లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసమని ప్రదర్శించనున్నారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అందరు పిల్లల తల్లిదండ్రులను ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. ఇకపోతే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం 46,78,361 మంది తల్లులు ఈ పథకానికి అర్హులుగా తేలారు. అంతేకాకుండా ఈ పథకానికి సంబందించిన ఏవైనా మార్పులు చేర్పులు ఉంటె వాటిని సరి చేసుకోడానికి జనవరి 2 వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు. ఇకపోతే అన్ని ఆధారాలు సమకూర్చిన తరువాత అర్హులందరికీ జనవరి 9 నుండి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున చేరనున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.