Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీకే పబ్లిసిటీ పిచ్చి ఉందని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో మోడీని మించిపోయారు. కేసీఆర్ హడావిడి చూస్తుంటే జీఎస్టీ కేంద్రానిదా, రాష్ట్రానిదా అనే అనుమానం వస్తోందని జనాలకి. ఆయనేంటో ఈ మధ్య మోడీ ఏం చేసినా వీర లెవల్లో భజన చేస్తూ తరించేస్తున్నారు. గులాబీ బాస్ వ్యూహమేంటో టీఆర్ఎస్ నేతలకే అంతుచిక్కడం లేదు. అసలు బీజేపీని విమర్శించి, మోడీని నెత్తిన పెట్టుకోవడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
జీఎస్టీతో నష్టాలు తప్పవని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మొత్తుకుంటుంటే కేసీఆర్ మాత్రం బేఫికర్ అంటున్నారు. జీఎస్టీతో అంతా మంచే జరుగుతుందని భరోసా ఇస్తున్నారు. జీఎస్టీ అమలుపై సమీక్షించిన కేసీఆర్.. తెలంగాణకు అంతా మేలే జరుగుతుందని, వ్యాపారులుక భయం అక్కర్లేదని చెబుతున్నారు. కేసీఆర్ మాటలు విని వ్యాపారులకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. మరి ఇంతకూ ఏం చేస్తారో నని ఉలిక్కిపడుతున్నారు.
కేంద్రానికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్రాలకు పంకాలు పెరుగుతాయని, అప్పుడు లాభమే కానీ నష్టం లేదని అంటున్నారు కేసీఆర్. ఇప్పటికే జీఎస్టీ పేరు చెప్పి లేనిపోనివన్నీ పెంచుతున్నా అడిగే నాథుడే లేడు. అసలు జీఎస్టీలో ఉన్న జాబితాకు, రేట్లు పెరుగుతున్న వాటికి సంబంధం లేదు. కానీ వ్యాపారుల ఇష్టారాజ్యం. వాళ్లు కేంద్రం మీద కసిని జనం మీద చూపిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. కేసీఆర్ మరోలా మాట్లాడటంలో లోగుట్టు ఏంటో.
మరిన్ని వార్తలు