Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
CM KCR Is Telangana Mahatma Gandhi?
కేసీఆర్ ఎలాంటివారో మరోసారి స్పష్టమైపోయింది. ఓవైపు కేటీఆర్ ఫ్లెక్సీలు కనిపించొద్దని ఆర్డర్లు వేస్తుంటే.. మరోవైపు గులాబీ నేతలు తెలంగాణ గాంధీ కేసీఆర్ అంటూ బ్యానర్లు కడుతున్నారు. తండ్రిని పొగుడుతున్నారు కాబట్టి అలాంటి వారిని కేటీఆర్ ఏమీ అనలేకపోతున్నారు. అసలు మహాత్ముడైన గాంధీతో కేసీఆర్ కు పోలికేంటని విమర్శకులు మండిపడుతున్నారు.
అభిమానులకు హద్దుల్లేవు. భక్తికి విచక్షణ లేదు. అందుకే రెచ్చిపోతున్నారు. కానీ నేతలకు బాధ్యత ఉండాలి కదా. కేసీఆర్ కు అదేం లేదని చాలా సందర్భాల్లో రుజువైంది. గాంధీ అధికారానికి దూరంగా ఉంటే.. కేసీఆర్ మాత్రం ఎప్పుడూ రెచ్చగొట్టడానికే ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా జరిగిందని అందరూ అనుకుంటున్నా.. అసలు తెరవెనుక ఏం జరిగిందో వ్యాపారులు, ఆంధ్రావారిని అడిగితే చెబుతారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ చేసిన వసూళ్లు నభూతో నభవిష్యత్ అంటే అతిశయోక్తి కాదు.
అలాంటి కేసీఆర్ ను జాతిపిత గాంధీతో పోల్చి ఆయన్ను కూడా అవమానిస్తున్నారు. కేసీఆర్ ఏం చేసినా లెక్కలేసుకుని, బ్లాక్ మెయిల్ చేసి చేశారు. కానీ గాంధీ మాత్రం నిస్వార్థంగా జనం కోసం పోరాడారు. ఆయనే కావాలనుకుంటే మొదటి ప్రధాని అయ్యేవారు. కానీ స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీనే ఎత్తేయండని చెప్పిన నిజాయితీపరుడు గాంధీ. అంతేగానీ కేసీఆర్ లా మాటలు మార్చడం ఆయనకు చేతకాలేదు.
మరిన్ని వార్తాలు: