హుజూర్నగర్ ప్రజలకి సీఎం కేసీఆర్ అఖండ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ హుజూర్నగర్ ఉపఎన్నిక విజయం తర్వాత మీడియాతో ప్రతీకూల పరిస్థితుల్లో తాను వెళ్లలేకపోయిన కూడా అద్భుత మెజార్టీ తో ప్రజలు గెలిపించారని చెప్పారు. ఏదో ఆశామాషీగా అలవోకగా వేసిన వేటు అనుకోవటం లేదు. చాలా ఆలోచన చేసి వేసినట్లుగా భావిస్తున్నాం అని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంవత్సర కాలంలో జరిగిన ఉప ఎన్నికలో సాదించిన గెలుపు కాబట్టి.. ప్రజలు ఏదో ఆశామాషీగా వేసిన వేటు కాదని, ఆలోచన చేసి గెలుపించారని..ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికల విజయం టానిక్‌లాగా పనిచేసి ఇంకా ఉత్సహాంతో పనిచేయడానికి అవకాశం ఉందని అన్నారు.
ఏఏ ఆశలు, నమ్మకాలు పెట్టుకుని హుజూర్ నగర్ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారో వంద శాతం వారి కోరికలు తీర్చుతామని సీఎం తెలుపుతూ 43 వేల మెజార్టీతో గెలిచిన అభ్యర్థి సైదిరెడ్డిని ఆశీర్వదించారు.