Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ పెళ్లివేడుకల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ వ్యవహరించిన తీరు కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోడానికే అన్న వాదన మొదలైంది. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీతో సంబంధం లేకుండా కమ్మ సామాజిక వర్గ నాయకుల మీద తెరాస టార్గెట్ చేసింది. ఆ తర్వాత కూడా టీడీపీ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. మాగంటి గోపినాథ్, గాంధీ వంటి కమ్మ ఎమ్మెల్యేలు కూడా తెరాస లో చేరారు. ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కమ్మ ఓటర్లు వున్నారు. వీరు ఆది నుంచి టీడీపీ కి అండగా ఉంటూవస్తున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వీరు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస కి వ్యతిరేకంగా మిగిలిన రాజకీయ శక్తులు ఏకం అవుతుండటంతో కెసిఆర్ కమ్మ వర్గాన్ని ఆకర్షించేందుకు పరిటాల ఇంటి పెళ్ళిలో ఇంతగా రెచ్చిపోయారట.
టీడీపీ దెబ్బ తిన్నాక తెలంగాణాలో కమ్మ నాయకులు ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్నారు. కాంగ్రెస్ కి ఆది నుంచి దూరంగా వుంటూ వస్తున్న ఆ వర్గం ఆ పార్టీకి తేలిగ్గా దగ్గర కాలేకపోతోంది. ఇక మిగిలింది బీజేపీ. ఆ పార్టీ అటు ఆంధ్ర, ఇటు తెలంగాణాలో వ్యవహరిస్తున్న తీరు ఆ వర్గానికి అంతగా నచ్చడం లేదు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ తెరాస కి దగ్గర అయితే అన్న ఆలోచన ఆ వర్గంలో ఉన్నప్పటికీ ఎక్కడో సందేహం. ఇప్పుడు కెసిఆర్ వెంకటాపురం పర్యటనతో ఆ వర్గంలో కూడా నమ్మకం పెరిగిందట. ఒకవేళ మోడీ కి వ్యతిరేకంగా టీడీపీ ,తెరాస ఒక్క తాటిపైకి వస్తే చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది జరగకపోయినా తెరాస కి కమ్మోళ్లని దగ్గర చేర్చుకోడానికి కెసిఆర్ మరికొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారేమో.సెట్ట్లెర్స్ పేరుతో కాంగ్రెస్ జంటనగరాల్లో బలం పెంచుకోడానికి చేస్తున్న ప్రయత్నాలకు కెసిఆర్ ఇలా చెక్ పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ పరిణామాలు ఊహకి అందని విధంగా సాగుతున్నాయి.