వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పర్యటన

వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పర్యటన

తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేసి, బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామ రూపరేఖలు మారాలని అన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రి చేద్దామని ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కావొద్దని, ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని సూచించారు.