Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్టే చల్లారినా మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. రెండు దేశాల మధ్య యుద్ధమే తరువాయి అన్నట్టుగా చేజారిన పరిస్థితులు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించటంతో అదుపులోకొచ్చాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ లో ప్రశంసించారు కూడా. తెలివైన నిర్ణయం తీసుకున్నావని, క్షిపణి దాడి ఆమోదయోగ్యం కాదని ట్రంప్ ట్వీట్ చేశారు. అదే సమయంలో ఉత్తరకొరియాతో చర్చలకు సిద్దంగా ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించారు.
ఇక రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని ప్రపంచమంతా భావించింది. కానీ మూడు రోజులు గడవకముందే మళ్లీ రెండు దేశాల మధ్య హెచ్చరికల పర్వం మొదలయింది. తాజాగా కిమ్… క్లయిమాక్స్ దగ్గర పడిందని, అమెరికాకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నానని, విచారకరమైన వైఫల్యాలు ఎదుర్కొనేందుకు ఆ దేశం సిద్దంగా ఉండాలని ఘాటుగా హెచ్చరించారు. సరిహద్దు దేశం దక్షిణ కొరియాపైనా కిమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా చెప్పినట్టల్లా దక్షిణ కొరియా ఆడుతోందని మండిపడ్డారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వ నాశనమవుతుందని అమెరికా రక్షణ ప్రతినిధి ప్రకటించిన నేపథ్యంలో ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు చేసింది. ఈ మాటల యుద్ధంతో ఇరు దేశాలు మళ్లీ ఘర్షణ దిశగా కదులుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలు: