Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన జీఎస్టీ ప్రారంభమైంది. ఇదేదో పెద్ద పండుగలాగా కేంద్రం గ్రాండ్ గా జరిపింది. అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేక సమావేశం పెట్టి మరీ జీఎస్టీని మొదలెట్టారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు డుమ్మా కొట్టాయి. మిగతా పార్టీల సంగతి పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీ గైర్హాజరుకు చెప్పిన కారణాలు కూడా వెరైటీగా ఉన్నాయి.
ముఖ్యంగా జీఎస్టీపై స్పెషల్ ప్రోగ్రామ్ ను బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్… నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఎలా మాటలు మార్చారో కళ్లకు కడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీతో ఉపయోగం లేదని చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది ఇమ్మిడియట్ గా వైరల్ గా మారింది.
విచిత్రమేమిటంటే… అప్పట్లో కాంగ్రెస్ జీఎస్టీని సపోర్ట్ చేసి… ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. విదేశాల్లో ఉన్న రాహుల్ జీఎస్టీపై స్పందించారు. సరైన ప్లానింగ్, సంస్థాగత సంసిద్ధత లేకుండా జీఎస్టీని అమలుచేయడాన్ని జీఎస్టీ తమాషాగా ఆయన అభివర్ణించారు. అదేమంటే అసలు వ్యాపారులు సంవత్సరానికి అన్ని సార్లు ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు