Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొత్తం మీద విపక్షాలు ఇన్నాళ్లకు మోడీ కంటే ముందు ఓ పనిచేశాయి. రాష్ట్రపతి అభ్యర్థి కాస్త ఉపరాష్ట్రపతి పదవి స్థాయికి దిగజార్చాయి. గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా విపక్షాలు భావించాయి. అయితే ఎన్డీఏ అనూహ్యంగా దళిత్ కార్డు ప్రయోగించడంతో… విధిలేక మీరాకుమార్ ను బరిలోకి దించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పక్షాలు అగ్రవర్ణాలనే బరిలోకి దించుతారని అంచనా వేసుకుని… తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించేశాయి.
గోపాలకృష్ణ గాంధీ మహాత్మాగాంధీ మునిమనవడు. కాంగ్రెస్ నీనియర్ నేత రాజాజీతో కూడా ఆయనకు చుట్టరికం ఉంది. ఇలాంటి స్టేచర్ ఉన్న వ్యక్తిని నిలబెడితే.. ఆయనకు దీటుగా ఎన్డీఏ అభ్యర్థి కోసం వెతకాల్సి ఉంటుందని యూపీయే అంచనా వేస్తోంది. కానీ ఎన్డీఏ శిబిరం మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటుంది. ఎప్పటిలాగే పొలిటీషియన్ ను ఉపరాష్ట్రపతి చేయాలని భావిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు పేరు చురుగ్గా పరిశీలనలో ఉంది.
విద్యాసాగర్రావు బరిలోకి దిగితే.. గోపాలకృష్ణ గాంధీతో లెక్క సరిపోతుంది. అయినా అభ్యర్థుల స్టేచర్ చూసి ఎవరూ ఓట్లేయరు. పార్టీ అనధికారిక ఆదేశాల మేరకే ఓటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు పార్లమెంటులో మెజార్టీ ఉన్న ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు. ఆమాత్రం దానికి ముందు ప్రకటిస్తే ఏంటి, తర్వాత ప్రకటిస్తే ఏంటని విపక్షాలు చర్చించుకుంటున్నాయ. మొత్తం మీద గెలుపోటముల సంగతి పక్కనపెడితే… కనీసం ఉపరాష్ట్రపతి పదవికైనా ముందుగా అభ్యర్థిని ప్రకటించామన్న తృప్తి మాత్రం విపక్షాలకు దక్కడం ఖాయమే.
మరిన్ని వార్తలు