జేసీ ఏంటీ పిచ్చి ఆలోచన..?

jc dhiwakar reddy planing for revolution

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దుందుడుకు ప్రవర్తనతో అటు పార్టీకి, ఇటు తనకు చెడ్డపేరు తెచ్చుకున్న జేసీ దివాకర్ రెడ్డి.. ఏకంగా ఎయిర్ లైన్స్ సంస్థలమీదే న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారట. వినడానికి కామెడీగా ఉన్నా ఇది నిజమే. అసలు ఓ వ్యక్తిని నిషేధించడానికి ఎయిర్ లైన్స్ సంస్థలకు ఉన్న అధికారమేంటని జేసీ తెలుసుకోవాలనుకుంటున్నారట. ఈ సంగతి గతంలో గైక్వాడ్ ఇష్యూలోనే కేంద్రమంత్రి అశోక గజపతి రాజు పార్లమెంటులో చెప్పేశారు కదా అంటే.. అప్పుడు జేసీ తన మ్యాటర్ కాదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదట.

కానీ ప్రతిసారీ ప్లేన్ టికెట్ బుక్ చేసుకోవడం, చివరకు ఫ్లైటెక్కే సమయంలో అడ్డుకోవడంతో జేసీ బాగా ఇరిటేట్ అవుతున్నారట. కానీ మరో దుడుకు పనిచేస్తే అసలుకే ఎసరు వస్తుందని అక్కడ సైలంట్ గా ఉంటున్నా.. ఇంటికొచ్చాక అనుచరుల దగ్గర వైలంట్ గా రియాక్ట్ అవుతున్నారట. అసలు తానే తప్పు చేయలేదని, అలాంటప్పుడు సారీ చెప్పి ఎందుకు కాంప్రమైజ్ కావాలని ప్రశ్నిస్తున్నారట. అవసరమైతే అల్టర్నేటివ్ చూసుకుంటాం కానీ.. సారీ మాత్రం చెప్పనని మొండిపట్టు పడుతున్నారట.

కానీ జేసీ అల్టర్నేటివ్ అంటున్నారు కానీ.. అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఫ్లైట్ కు అల్టర్నేటివ్ ఇంకా రాలేదు. ట్రైన్లు ఉన్నా అవి జీవితకాలం లేటన్న సంగతి అందరికీ తెలుసు. ట్రైన్లను నమ్ముకున్న గైక్వాడ్ గతి ఏమైందో ఎంపీలందరూ చూశారు. అందుకే జేసీ బెట్టు తగ్గించుకుని, కాస్త రాజీ మార్గంలో పయనించాలని సొంత పార్టీ టీడీపీ కూడా కోరుకుంటోంది. ప్రెస్ మీట్ పెట్టి సారీ చెబితే.. ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారట. మరి జేసీ ఏం చేస్తారో.

మరిన్ని వార్తలు:

రెండిందాల బెట్టు చేస్తున్న కేంద్రం

అమెరికాకి, ఇండియాకి తేడా లేదా..?