విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పుణ్యామా అని మరి కాస్త పుంజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఏపె ఇంచార్జ్ గా నియమితులైన కేరళ మాజీ సిఎం ఊమెన్ చాందీ ఏపీలో విస్త్రతంగా పర్యటిస్తూ పార్టీ నేతల్లో ఉత్సహాన్ని నింపుతూ కాంగ్రెస్ నేపధ్య ఉందీ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకుండా ఖాళీగా ఉన్న బలమైన నేతలను లిస్టవుట్ చేసుకుని వారితో చర్చలు ప్రారంభిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని విజయవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చగలగిన ఆయన ఆ తర్వాత తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. రాయలసీమ నుంచే మరో కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారు.
దీంతో ఇక ఇప్పుడు తర్వాతి టార్గెట్ గా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలే టార్గెట్ గా ఆయన కోస్తా జిల్లాల పర్యటనకు ఊమెన్ చాందీ సిద్ధమయ్యారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఎలా అయినా ముద్రగడను పార్టీలోకి తెచ్చేందుకు తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతామోహన్ తో ముద్రగడ పద్మనాభం వద్దకు రాయబారం పంపారు. ఎందుకంటే ముద్రగడకు, చింతామోహన్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కారణంతో చింతామోహన్ కూడా వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముద్రగడను కోరారు.
ముద్రగడ పార్టీలోకి వస్తానంటే.. తానే స్వయంగా ఇంటికి వచ్చి పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానిస్తానని ఊమెన్ చాందీ కబురు పెట్టారట. కానీ ముద్రగడ ఇప్పుడు ఏమి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నిన్నమొన్నటి వరకూ బాబుని తిట్టి వైసీపీ వెనకేసుకొచ్చిన ఆయన జగన్ దెబ్బకి మళ్ళీ బాబుకే జై కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నుండి కూడా ఆయనకు సానుకూల పవనాలు ఉన్నాయి. కానీ నేరుగా ఎవరూ వచ్చి ఆయన్ని అడగలేదు కానీ వస్తానంటే వద్దనరు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏ వచ్చి అడిగినా కాంగ్రెస్ కి ఏపీ లో బలం లేదు సో ఇప్పుడు ముద్రగడ పరిస్థితి రసకందాయంలో పడింది అనే చెప్పాలి.