శ్రీరెడ్డి కి లారెన్స్ సవాల్..!

Raghava Lawrence Open Challenge to Sri Reddy

సినిమా పరిశ్రమలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌పై ఈమద్య కాలంలో చాలా మంది నోరు విప్పుతున్నారు. చాలా కాలంగా ఈ జాడ్యం ఉనప్పటికి అంతా కూడా నాకెందుకులే అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి ఉద్యమం ప్రారంభించింది. ఈమె పనిని అంతా అభినందించారు. కాని ఈమె చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టి అసు దారిని మర్చిపోయేలా చేసింది. తెలుగు సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీపై కూడా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తమిళ ఇండస్ట్రీ ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలతో అట్టుడుకున్న విషయం తెల్సిందే.

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌, నటుడు శ్రీకాంత్‌, లారెన్స్‌, సుందర్‌ సి ఇలా ఎంతో మందిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆమె వ్యాఖ్యలను తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం కొట్టి పారేసింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం పెరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు లారెన్స్‌ ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తనను శ్రీరెడ్డి ‘రెబల్‌’ చిత్రాన్ని చేస్తున్న సమయంలో కలిసిన విషయం నిజమే. ఆమెకు తాను ఛాన్స్‌ ఇస్తాను అంటూ మాట కూడా ఇచ్చాను. కాని ఆమె తనను తాను నిరూపించుకోలేక పోయింది. ఆమెకు నటనలో కనీసం ఓనమాలు రాకపోవడం వల్లే నేను ఆమెకు ఛాన్స్‌ ఇవ్వలేక పోయాను.

ఆమె ఇంతగా ఆరోపణలు చేసినప్పటికి ఆమె నటన ప్రతిభను తనకు చూపిస్తే ఇప్పుడైనా కూడా ఛాన్స్‌ ఇచ్చేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె నటన సామర్థ్యంను చూపించాల్సిందిగా లారెన్స్‌ సవాల్‌ చేశాడు. ఒక వేళ ఆమెకు మీడియా ముందు ఇబ్బందిగా అనిపిస్తే తన అసిస్టెంట్‌ మరియు లాయర్‌ ముందు నటించి ఒప్పిస్తే అప్పుడు అయినా ఛాన్స్‌ ఇస్తాను అంటూ ప్రకటించాడు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం లేదని, తాను మహిళలను దేవుళ్లుగా భావిస్తాను, అలాంటి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిసానా అంటూ లారెన్స్‌ చెప్పుకొచ్చాడు. శ్రీరెడ్డి విషయంలో దేవుడు అంతా మంచి చేయాలని, ఆమె జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తాను అంటూ లారెన్స్‌ ట్వీట్‌ చేయడం జరిగింది. తనపై ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు తాను ముందుకు వచ్చాను. ఇకపై అయినా ఈ వివాదానికి శ్రీరెడ్డి ముగింపు పలుకుతుందని భావిస్తున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు. అయితే శ్రీరెడ్డి మాత్రం తీవ్ర స్థాయిలో లారెన్స్‌పై విమర్శల వర్షం కురిపించింది. వాటన్నింటిని ఉత్తిదే అంటూ ఆయన కొట్టి పారేయడం జరిగింది. మరి లారెన్స్‌ నటన సవాల్‌కు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.