గత కొద్దిరోజుల నుండి తెలంగాణా కాంగ్రెస్ తెరాస నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్ నాయకులు మంత్రి కేటీఅర్ ని విమర్శిస్తుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను మంత్రి కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా విమర్శిస్తున్నారు. ఈ విషయం మీద సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులకు శిక్షణ ఇస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. పెద్దలను గౌరవించే సంప్రదాయం కేటీఆర్ కు ఏమాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో పవన్ కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ప్రజల కోసం పోరాటం చేసిన అనుభవం ఉందని పవన్ పొగిడారు దీంతో నిజంగా కేటీఆర్‌కి అంత మంచి లక్షణాలే ఉంటే.. ‘లుచ్చాగాళ్లు’ అంటూ కాంగ్రెస్‌పై చౌకబారు కామెంట్ చేస్తారా అని హనుమంత రావు ప్రశ్నిస్తున్నారు,
అందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని తాను స్వయంగా కలుస్తానని, కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ఆయనకు ఓ మంచి సలహా ఇవ్వాలని పవన్ ని కోరతానని వీహెచ్ అన్నారు. పెద్దలను గౌరవించాలన్న కనీస సంస్కారం కూడా కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమైనవేళ కాంగ్రెస్ శ్రేణులకు తాము శిక్షణ ఇస్తామని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆయన విరుచుకుపడ్డారు. తమకు ఎవరూ శిక్షణ ఇవ్వాల్సిన పని లేదని, కేసీఆర్‌కి శిక్షణ ఇచ్చి ఇంత పెద్ద నాయకుడిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. అవసరమైతే కేటీఆర్‌కి కూడా కాంగ్రెస్ పార్టీనే శిక్షణ ఇస్తుందని అన్నారు.