Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య కావల్సినంత రంజైన రాజకీయం నడుస్తోంది. అయితే ఇప్పుడు సీన్లోకి కాంగ్రెస్ ఎంటరైంది. నంద్యాల బైపోల్స్ లో అభ్యర్థిని నిలుపతామని రఘువీరా ప్రకటించినప్పట్నుంచీ.. ఎవర్ని బలిపశువును చేస్తారోనని హస్తం నేతలు గుబులుగా ఉన్నారు. ఇప్పుడు బలిపశువుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బుక్ చేశారు.
గతంలో కర్నూలు ఎంపీగా ఉన్న కోట్ల.. ఇప్పుడు నంద్యాల బరిలో దిగాల్సిందేనని రఘువీరా చెప్పారట. కాదు కూడదంటే.. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ను అయినా పోటీ చేయించాలని తెగ అడుగుతున్నారట. కానీ కోట్ల మాత్రం ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. తరతరాలుగా కాంగ్రెస్ లో ఉన్నందుకు పార్టీకి విశ్వాసం చూపించాలా.. లేదంటే సొంత గౌరవం కాపాడుకోవాలని అని ఆలోచనలో పడ్డారట.
కోట్ల మాజీ ఎంపీ అయినా ఆయనకు కర్నూలు పార్లమెంట్ పరిధిలో గౌరవం ఉంది. ఆయన వస్తే చేర్చుకోవడానికి టీడీపీ, వైసీపీ రెడీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకుంటే.. డిపాజిట్ పోవడం ఖాయమని, అప్పుడు దేనికీ పనికిరాకుండా పోతారని క్యాడర్ పోరు పెడుతోందట. దీంతో కోట్లకు డిపాజిట్ భయం పట్టుకుంది. మరి కోట్ల తీసుకునే నిర్ణయం మీదే నంద్యాలలో కాంగ్రెస్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది.
మరిన్ని వార్తలు: