ప్రపంచాన్నే అల్లకల్లోలలం చేస్తుంది కరోనా వైరస్. ఈ మహమ్మారితో ప్రజలంతా యుద్ధం చేస్తుంటే దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటం షాక్ కు గురిచేస్తుంది. ఢిల్లీలోని తీహార్ జైలు వేదికగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది ఇందుకు ఓ పథకం రచిస్తుండగా ఇరాన్‌కు చెందిన ఉద్రవాద జంట ఆ రహస్యాన్ని గుట్టు విప్పింది.
అయితే అది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి తెలిసింది. ఈ ఎన్ఐఏ తెలిపిన వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది తిహార్ జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు నేర్పుతున్నాడు. ముఖ్యంగా యువతను ఉద్రదాడులకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తున్నాడు. అదే జైల్లో శిక్ష అనుభివస్తున్న ఇరాన్ ఖొరాసన్ మోడ్యూల్‌కు చెందిన జంట ఉగ్రదాడి కుట్రపై పోలీసులుకు సమాచారం అందించి ఆ కుట్రను బయటపెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ విచారణ జరపగా.. ఉగ్రవాది తాను చేపట్టిన రహస్య కుట్రను బయపెట్టాడు.
కాగా గతంలో ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు సిరియా వెళ్ళేందుకు ట్రైచేసి మహారాష్ట్రలో పోలీసులకు చిక్కింది ఇతనే అని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దేశంలో నేరుగా దాడులకు దిగేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు ఇతను పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో నిందితున్ని 2018లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా ఘటనతో ఉగ్రవాదిని ఎన్ఐఏ కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా తెలంగాణ పోలీసులకు ఎన్‌ఐఏ అధికారులు సమాచారం అందించారు.