ఆయప్ప ఆలయంలోకి స్త్రీ అడుగుపెడితే ఆమెను రెండు ముక్కలు చేయాలి…!

Controversial Comments By Malayalam Actor For Women In Sabarimala

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగం పేరుతో ఆలయ సంప్రదాయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ఏంటని కేరళలోని మహిళలు సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే అంశం మీద మలయాళ నటుడు కొల్లం తులసి వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. శుక్రవారం కొల్లాంలో నిర్వహించిన సేవ్ శబరిమల కార్యక్రమానికి కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైతో కలిసి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

sabirimala-ayyappa
ఏ మహిళైనా ధైర్యం చేసి శబరిమల ఆలయంలోకి అడుగుపెడితే ఆమెను రెండు ముక్కులు చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు 50 ఏళ్ల పైబడిన అమ్మలు కూడా వీధుల్లోకి వచ్చి శబరిమల తీర్పునకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెవులు పగిలేలా అయ్యప్ప అఖండనామ కీర్తన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుడిలోకి వెళ్లేందుకు వచ్చే మహిళలను పట్టుకుని రెండు ముక్కలు చేసి ఒకదానిని ఢిల్లీకి విసిరి, మరోదాన్ని ముఖ్యమంత్రి గదిలో పడేయాలి. నాకు తెలుసు మీరెవరూ శబరిమల వెళ్లరు. ఎందుకంటే మీరంతా చదువుకున్నవారు, సున్నిత మనస్కులు. అయ్యప్ప తన పని చేయడం ప్రారంభించారు. దేవాదాయ మంత్రి మనసు త్వరలోనే మారుతుంది’ అని కొల్లం తులసి వ్యాఖ్యానించారు.

sabirimala