తెలంగాణ లో బీభత్సంగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ లో బీభత్సంగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి… కరోనా వైరస్ నివారణను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలకమైన, కఠినమైన నిర్ణయాలను తీసుకుంటుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరింత కఠినంగా అమలు చేయడానికి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో పాటే అదికారులందరు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ, ప్రజలను అందరిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలందరికి కూడా సరైన అవగాహనను కల్పిస్తున్నారు. కాగా భయంకరమైన మహమ్మారికరోనా వైరస్ ని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది.

కాగా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నిర్ధారిత పరీక్షలను భారీగా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా హైదరాబాద్‌లో నేటి నుంచి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారులు. కాగా మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రములో మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ అని అధికారులు వెల్లడించారు. కాగా మొబైల్‌ వైరాలజీని డీఆర్‌డీవో, ఈఎస్‌ఐ సంయుక్తంగా అభివృద్ధి చేసాయని సమాచారం.