ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు దారుణంగా వ్యాపిస్తున్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు దారుణంగా వ్యాపిస్తున్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకు దారుణంగా వ్యాపిస్తుంది. కాగా ఈ కరోనా వైరస్ కారణంగా బాధితుల సంఖ్య కూడా రొజు రోజుకు పెరిగిపోతుంది. కాగా తాజాగా ఏపీలో మరో 22 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 427కు చేరుకుంది. దానికి తోడు గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి కరొన వైరస్ కారణంగా మృతి చెందాడు. దీంతో ఈ మహమ్మారి వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7 కి చేరుకుంది. కాగా దాచేపల్లి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు శ్వాస సంబంధ సమస్యలతో ఈ నెల 9 న పిడుగురాళ్లలో ఒక ఆసుపత్రిలో చేరాడు. కానీ ఆ వ్యక్తి పరిస్థితి విషమించడంతో గుంటూరులోని ఆసుపత్రికి తరలించాడు.

కాగా చివరికి అతడికి జరిపిన రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఇకపోతే గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు 1, కడప 1 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఒక 65 ఏళ్ళకి చెందిన ఒక వ్యక్తి విజయవాడలోని ఆస్పత్రి నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డీఛార్జ్ అయ్యారు. మొత్తం ఏపీలో ఈ వైరస్ సోకిన బాధితులు 12 మంది పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.