ఆంద్రప్రదేశ్ లో భయంకరంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ఆంద్రప్రదేశ్ లో భయంకరంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మహమ్మారి కరోనా వైరస్ కి సంబందించిన పాజిటివ్ కేసులు రోజురోజుకి చాలా భయంకరంగా పెరుగుతున్నాయి. ఇటీవల మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుమొఖం పట్టడంతో, రాష్ట్రంలో నమోదైన గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ సడలింపులు చేసి, కొన్ని రంగాలకు మినహాయింపులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఆంద్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ జరిపినటువంటి 10292 నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా, అందులో 67 పాజిటివ్ కేసులు తాజాగా నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లధించారు. కొత్తగా నమోదైన వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 1650 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో 524 మంది పూర్తిగా కోలుకుని, ఆసుపత్రి నుండి డిచార్జీ అయ్యారని అధికారులు వెల్లడించారు. అందులో 33 మంది కరోనా కారణంగా మరణించగా, 1093 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అదికారులు వెల్లడించారు…