ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ భారత్ లో మెల్లిమెల్లిగా పాకుతుంది. రోజురోజుకూ భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిద్వారానే కాకుండా ఢిల్లీలో జరిగిన ఓ ప్రార్థనా సమేవేశం ద్వారా కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక.. కాంటాక్ట్స్ ద్వారా కూడా కరోనా సోకుతుందని కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇదే.. సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘పిజ్జా’ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది.
అయితే పిజ్జా బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. అప్రమత్తమైన అధికారులు.. అతడు పిజ్జా డెలివరీ చేసిన 72 కుటుంబాలను సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాల్సిందిగా ఇప్పటికే హెచ్చరించారు.
అంతేకాకుండా ప్రముఖ ‘ఫుడ్ సప్లయి’ సంస్థకు చెందిన ‘డెలివరీ బాయ్’ అని తెలుస్తోంది. కాగా ‘డెలివరీ బాయ్’ తో పనిచేసే మరో 16మంది సహచరులకు కూడా ‘కరోనా’ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. మరి ఈ పిజ్జా డెలివరీ బాయ్ ద్వారా ఇంకా ఎవరికైనా కరోనా సోకిందా? ఆ సంస్థలో అతడితో పాటు పనిచేసే మిగతా డెలివరీ బాయ్‌ల పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.