దొంగతనం చేసిన ఓ దొంగ వలన పోలీసులు.. శిక్ష విధించిన జడ్జీ.. ఇలా అంతా ఇప్పుడు క్వారెంటైన్ కు తరలి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. దొంగ వలన క్వారంటైన్ కు వెళ్లడం ఏంటి..? అని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి మరి. బైకులను దొంగతనం చేసే ఓ దొంగను పంజాబ్ పోలీసులు పెద్ద సాహసం చేసి.. పిరిశోధనలు జరిపి మరీ పట్టుకున్నారు.
అయితే ఆ దొంగను పట్టుకున్న పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన జడ్జి దొంగకు శిక్ష విధించారు. నాలుగు రోజులు జైల్లో ఉన్న ఆ దొంగ అనారోగ్యం బారిన పడ్డాడు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు. అనుమానం వచ్చిన పోలీసులు దొంగకు కరోనా టెస్ట్ చేయించారు. ఇంకేముంది.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.
దొంగను పట్టుకున్న పోలీసులు.. అధికారులు కలిపి 17 మందిని క్వారంటైన్ కు తరలి వెళ్లాల్సి వచ్చింది. అలానే దొంగ కేసును విచారించిన జడ్జి కూడా 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ కు వెళ్ళిపోయారు. ఈ దొంగ పంజాబ్ లోని లూథియానాలో పట్టుబడే ముందు రాజస్థాన్ లోని జైపూర్ లో దొంగతనాలు చేశాడు. బహుశా అక్కడే దొంగకు కరోనా సోకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.