కరోనా వైరస్ చైనా లో ఉగ్ర రూపం దాల్చుతుంది. అయితే దీని ప్రభావం ఎంతగా ఉంటుందో ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలిసిపోయింది. అయితే టిసిఎల్ లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శిక్షణ కోసం సహోద్యోగులతో చైనా కి కంపెనీ తరపున వెళ్లారు. అయితే కర్నూల్ జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన జ్యోతి భారత్ కి రాబోయే సమయం లో తనని అడ్డుకున్నట్లు తెలిపారు. తనతో ఉన్న మిగతా 58 మంది స్వదేశానికి ప్రయత్నించగా, తనని అడ్డుకున్నట్లు తెలియజేసారు. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉండటంతో తనకు కరోనా వైరస్ ఉందంటూ అధికారులు అడ్డుకున్నారని వివరించారు.
అయితే తనకి ఎలాంటి వైరస్ లేదని, అలసట వలన వచ్చిన ఉష్ణోగ్రత అని, తనకు ఎలాంటి పరీక్షలు చేయకుండా ఎలా నిర్దారిస్తారు అని తెలిపారు. తాను కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే జ్యోతికి తాజాగా పెళ్లి కుదిరిందని, ఎంగేజ్మెంట్ జరిగి, మరో పది రోజుల్లో పెళ్లి కావడం తో బయలుదేరినట్లు సమాచారం. ఇప్పటికే జ్యోతి పరిస్థితి గురించి తన తల్లిదండ్రులు విదేశాంగ శాఖ ని సహాయం కోసం కోరారని తెలుస్తుంది.