ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. దాని విరుగుడు కనిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికప్పుడు కోవిడ్ ను పూర్తిస్థాయిలో నాశనం చేసే అవకాశం లేకున్నా… దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తి వ్యవస్థను డెవలప్ చేసే ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.
అంటే.. కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అనే కీలకమైన అంకంలోకి అడుగు పెడుతున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు తాము కనిపెట్టిన వ్యాక్సిన్ ను18 నుంచి 55 ఏళ్ల వయసురన్న ఆరోగ్యవంతుల్ని ఎంచుకొని వారిపై పరీక్షలు జరుపుతారు.
ఇందుకోసం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించనున్నారు. సీటెల్ లో దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు ఓకే చెప్పి ముందుకు వచ్చిన వారికి రానున్న పద్నాలుగు నెలల్లో రెండుసార్లు వ్యాక్సిన్ ను ఇంజెక్టు చేస్తామంటున్నారు.