దేశంలో క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా కేసులు

దేశంలో రోజువారి కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 41,383 క‌రోనా కేసులు నమోదు కాగా 507 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,987కు చేరింది.

గత 24 గంటల్లో కరోనా నుంచి 38,652 మంది కోలుకుని డిశ్చార్జ్‌కాగా ఇప్పటివరకు 3,04,29,339 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో​ 4,09,394 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 41,78,51,151 మందికి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.