సీపీఐ, సీపీఎం కలిసి పోవాలని నిర్ణయించుకున్నాం : కూనంనేని

CPI and CPM have decided to go together: Koonanneni
CPI and CPM have decided to go together: Koonanneni

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ, సీపీఐ(ఎం) కీలక నేతల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, జాన్ వెస్లీ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించే ప్రణాళికలపై ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.

సమావేశం అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ.. ఎంఐఎం, బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఏదో ఒక రకంగా రెండు పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయి. అందరి మీద దాడి చేస్తున్న బీజేపీ.. ఎంఐఎం, బీఆర్ఎస్ లను మాత్రం టచ్ చేయడం లేదు. రాజ్యాంగం సెక్యులర్ అనే పదం తీసేయడం దారుణమన్నారు. మాది హిందూ అజెండా అని చెప్పాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) కలిసిపోవాలని నిర్ణయించుకున్నాం. రెండు పార్టీలు కలిసి సంప్రదింపులు చేయాలనుకుంటున్నాం. రాబోయే ఎన్నికలపై చర్చించాం. వినాయక నిమజ్జనం తరువాత మరోసారి సమావేశం అవుతామని తెలిపారు. అక్టోబర్ 01 నుంచి కలిసి పని చేస్తామని తెలిపారు.