ప్రస్తుతం మార్కెట్‌లో 5G స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. మొబైల్ తయారీ సంస్థలు కూడా పెద్ద ఎత్తున 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుండగా , దేశ వ్యాప్తంగా 5G సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి . అలాగే ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. తక్కువ ధరకే 5G ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో (Poco) తక్కువ 5జీ ఫోన్‌ను ధరలోనే తీసుకొచ్చింది. పోకో ఎమ్6 ప్రో (Poco M6 Pro) పేరుతో భారత్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఇటీవల విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ను షావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 9న జరిగింది. చీపెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. పోకో ఇండియా రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించింది.త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పింది.
Poco M6 Pro 5జీ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 … అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ ఫోన్‌ను కేవలం రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు.