NBK109 మూవీకి క్రేజీ అప్డేట్.. ఆయన పార్ట్ కంప్లీట్!

Crazy update for NBK109 movie.. His part is complete!
Crazy update for NBK109 movie.. His part is complete!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన కెరీర్‌లోని 109వ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ ను యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్నారు . ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఒక వీడియో గ్లింప్స్‌ని గతంలో రిలీజ్ చేశారు మేకర్స్. దానికి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ కూడా దక్కింది. ఇక ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో అప్డేట్‌ని దర్శకుడు బాబీ రివీల్ చేశాడు.

Crazy update for NBK109 movie.. His part is complete!
Crazy update for NBK109 movie.. His part is complete!

ఈ మూవీ లో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతుంది . అయితే, ఈ మూవీ లోని బాబీ డియోల్ పాత్రకి సంబంధించిన షూటింగ్ తాజాగా ముగిసినట్లుగా దర్శకుడు బాబీ ప్రకటించాడు. బాబీ డియోల్‌తో కలిసి ఉన్న ఫోటోని దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

ఇక ఈ మూవీ కు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీ ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.